
యేసు తల్లియైన మరియమ్మా,
నీ హృదయాన్ని నాకు దయచేయి,
అది ఎంత సుందరమైనదో,
ఎంత నిర్మలమైనదో,
ఎంత నిష్కళంకమైనదో,
ప్రేమతోను వినయంతోను ఎంత నిండినదో:
జీవాహారమైన రొట్టెలో యేసును స్వీకరించగలిగేలా
నన్ను చేయి,
నీవు ఆయనను ప్రేమించినట్లే నేను ఆయనను ప్రేమించి,
అత్యంత పేదలలో పేదవారి దీనమైన రూపంలో
ఆయనకు సేవ చేయగలిగేలా చేయి.
ఆమేన్
కలకత్తా సెయింట్ తెరేసా.

